uప్రజాశక్తి-మంగళగిరి : దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సిపిఎం సీనియర్ నాయకులు జె వి రాఘవులు, సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం సిపిఎం పట్టణ కమిటీ, కెవిపిఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారని అన్నారు. ఆ రాజ్యాంగానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని విమర్శించారు. రాజ్యాంగం వలన పేద ప్రజలకు మేలు జరిగిందని అన్నారు. బిజెపి పాలకులు రాజ్యాంగాన్ని మార్చడానికి పూనుకున్నారని విమర్శించారు. దేశంలో మైనార్టీలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. బిజెపి పార్టీకి అంబేద్కర్ జయంతి జరిపే హక్కు లేదని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు ఎస్ ఎస్ చెంగయ్య, సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ, కెవిపిఎస్ పట్టణ కార్యదర్శి వై కమలాకర్, సిపిఎం పట్టణ నాయకులు ఎం చలపతిరావు, కెవిపిఎస్ నాయకులు ఎస్ కోటేశ్వరరావు, ఈ విజయలక్ష్మి, ఈ కాటమరాజు, బి స్వామినాథ్, గోలి దుర్గాప్రసాద్, ఎయిమ్స్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నాయకులు కే బుజ్జి బాబు, కే రాజమోహన్, ఏ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
