సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ అజయ్ కుమార్
ఎడ్లపాడులో ప్రారంభమైన సిఐటియు శిక్షణ తరగతులు
తొలిరోజు పలు కార్యక్రమాల నిర్వహణ
ప్రజాశక్తి-యడ్లపాడు, చిలకలూరిపేట : కార్మిక సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే దారి చూపుతాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ. అజయ్ కుమార్ పేర్కొన్నారు.పల్నా డు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో సిఐటి యు రెండు రోజుల రాష్ట్ర నాయక త్వ ప్రాంతీయ శిక్షణ తరగతులు శని వారం ప్రారంభ మయ్యాయి. గ్రామం లోని పిఆర్ విజ్ఞాన కేంద్రంలో తొలి రోజు కార్యక్రమాల్లో భాగంగా పలు కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా మొదటగా సిఐటియు పథ కావిష్కరణ సిఐటియు పల్నాడు జి ల్లా ఉపాధ్యక్షులు పెరుబోయిన వెం కటేశ్వర్లు ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ పోరా ట స్ఫూర్తిని అందించిన ఉద్య మ నాయకుడు స్వర్గీయ పోపూరిరామా రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ స్థాయిలో ఉద్యమ చరిత్ర లో మైలురాయిగా నిలిచిన బాలా నందన్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ పూర్వ జాతీయ అధ్యక్షులు బాల నందన్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్య అతిథి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.అజయ్ కుమార్ మాట్లాడుతూ నేతలు క్షేత్రస్థాయిలో కార్మికుల మధ్య ఉండాలని, వారి సమస్యలు గ్రహించి ఉద్యమ బాట లో ముందుకు సాగాలన్నారు. పేదరికం నుంచి అనేక ఉద్యమాలు చేస్తూ ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీ గా అనేక పదవులను అలంకరించిన బాలచందర్ ఉద్యమ స్ఫూర్తి నేడు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవా లన్నారు. సినియర్ నాయకులు ఎన్ నూతలపాటి కాళిదాస్, పోపూరి సుబ్బారావు మాట్లాడుతూ ఎడ్ల పాడుకు చెందిన పోరాట యోధుడు పోపూరి రామారావు పోరాటపటి మలను ఈ నాటి వారు ఆదర్శంగా చేసుకొవ లన్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఉద్యమానికి పునాది వేశారని,పార్టీకి క్రమశిక్షణ, సమయపాలన, ఉద్యమ ప్రణాళిక లు ఎంతో అవసర మన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల పార్టీ బాధ్యులకు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించగా, రాష్ట్ర నాయకురాలు డి. రమాదేవి తరగతులను నిర్వహించారు. ఎస్. ఆంజనేయ నాయక్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ప్రజానాట్య మం డలి ఆలపించిన అభ్యుదయ గీతా లు అత్యజాన్నిచ్చాయి. ఈ శిక్షణ తరగతులు కార్యకర్తల్లో కొత్త శక్తిని నింపుతూ, ఉద్యమాలకు పునాది రాయి వేశాయి. కార్యక్రమంలో సిఐ టియు ఎన్టీఆర్ కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి. హెచ్. శ్రీనివాస్, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి. విజయ్ కుమార్, ముత్తవరపు పద్మా రావు, ఆరు జిల్లాల సిఐటియు బేవర్స్ పాల్గొన్నారు
