సోమవారం అత్యల్పముగా 20 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
ప్రజాశక్తి-చిలకలూరిపేట : పట్టణ, మండల స్థాయిలో మొన్నటి వరకు తక్కువగా విచిన చలి గాలులు ప్రస్తుతానికి ఎక్కువగా విస్తున్నాయి. సాయంత్రం కూడా కాక ముందే చలి గాలులు విస్తున్నాయి. రాత్రి గడిచే కొద్ది మరింత చల్లగా మారి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రజలు వెచ్చదనం కోసం తపించిపోతున్నా రు. ఉదయం షుమారుగా 9 గంటలు అయిన కూడా సూర్యడు రావటం లేదు. అది కూడా వచ్చేదా.. వద్దా.. అన్నట్లు వస్తుండటంతో ప్రజల పరిస్తుతి రోజు రోజుకి చాలి గాలులతో దారుణంగా ఉంది. నిన్న మొన్నటి దాకా కార్తీకమాసం ప్రారంభమైనా ఇంకా చలి ప్రారంభం కాలేదనుకున్నారు. ప్రస్తుతం చలితో పాటు, శీతల గాలులు వీస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పైగా కొద్దీ రోజుల నుంచి అత్యల్పఉష్ణోగ్రతలు నమోదౌ తున్నాయి. వ్యవసాయ భూములుంటే గ్రామీణ ప్రాంతాల్లో చలి ప్రభావం మరించ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో చలి వల్ల ప్రజలు జలుబు, దగ్గు, బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు, వ్యాధిని రోధక శక్తి తక్కువ వారు శ్వస కోశ వ్యాధులు, ఇతర శీతాకాల జబ్బుల బారిన పడుతున్నారు. చాలా మంది శ్యాసనాళాలు మూసుకుపోయి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నా రు. ఇదే సమ యంలో ఒక రకమైన ఇన్ఫ్లూయింజ వైరస్ కూడా ఈ సీజన్లో వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాలుల నేప థ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారు శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం, బిపి, చర్మ వ్యాధులు, సిఓ పిడియా, ఆస్మాతో బాధ పడేవారు దగ్గు, జలుబు అయాసం వస్తే వైద్యులను కలిసి వారి పరిస్థితిని వివరించి చికిత్స తీసుకోవాలని అంటున్నారు. వీరు చలి కాలలలో ఉదయం వేళ మంచు కురిసే సమయంలో వాకింగ్ కి వెళ్లటము మంచిది కాదని వైద్యులు చెప్తూతున్నారు
