కలకలం రేపిన మహిళ మృతదేహం

Mar 31,2024 11:52 #Guntur District

ప్రజాశక్తి-తెనాలి : గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో మహిళ మృతదేహం కలకలం రేపింది. రూరల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గ్రామంలోని సంగమేశ్వర స్వామి ఆలయం సమీపంలో డంపింగ్ ప్రాంతంలో మహిళ మృతదేహం కాలిన స్థితిలో ఉన్నట్లు పంచాయతీ సిబ్బంది ద్వారా సమాచారం అందిందన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించామని, మృతురాలి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చునన్నారు. ఆమె మృతిపై స్థానికులను విచారిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

➡️