నూతన కార్యవర్గ తొలి సమావేశం

Feb 3,2025 15:49 #Guntur District

ప్రజాశక్తి-తెనాలి రూరల్ : వైఎస్ఆర్సిపి జిల్లా నూతన కార్యవర్గ తొలి సమావేశం తెనాలి గౌతమ్ గ్రాండ్ హోటల్ లో సోమవారం నిర్వహించారు. గుంటూరు జిల్లా సమన్వయకర్త, మాజీ మంత్రి అంబటి రాంబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో తెనాలి, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ, గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు ఏడు నియోజక వర్గాల ఇంఛార్జీలు, నూతన కార్యవర్గ సభ్యులు పాల్గున్నారు. తెనాలి మాజి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రతిపాదన మేరకు తెనాలిలో తొలి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సి మురుగు హనుమంతరావు, మంగళగిరి, ప్రత్తిపాడు, పొన్నూరు, నియోజకవర్గ అధ్యక్షులు దొంతిరెడ్డి రామి రెడ్డి, బాలసాని కిరణ్ కుమార్, అంబటి మురళి కృష్ణ, తెనాలి మున్సిపల్ ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక పార్టీ కార్యకలాపాలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం కార్యవర్గ సభ్యులు, సమన్వయ కర్తలతో కలసి పార్టీ విధివిధానాలు, తీర్మానాలు అలాగే ప్రతిపక్ష కూటమి ప్రకటించిన హామీలు వాటి అమలు, తదితర అంశాలపై చర్చించారు.

➡️