కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం 

Feb 2,2025 16:53 #Guntur District

ప్రజాశక్తి-మంగళగిరి : 2025-26 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి పేరని అన్యాయం జరిగిందని సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు ఎస్ ఎస్ చంగయ్య అన్నారు. ఆదివారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభజన హామీలు, ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలు బడ్జెట్లో ఏమీ లేవని అన్నారు. అమరావతి రాజధాని ప్రస్తావనలేదని విమర్శించారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బడ్జెట్ను రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మద్దతు తెలియజేయటం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న టిడిపి, జనసేన పార్టీలు తాకట్టు పెడుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా వారు కేంద్ర ప్రభుత్వ విధానములో మార్పు చేసుకోకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై కమలాకర్, ఎం బాలాజీ, పట్టణ నాయకులు ఎం చంద్ర, ఎం నాగేశ్వరావు, ఎం చలపతిరావు, ఎస్ గణేష్, సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఏం భాగ్యరాజు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎస్ కోటేశ్వరరావు, షేక్ జానీ భాష, షేక్ సత్తార్, జి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

➡️