ప్రజాశక్తి-తెనాలి రూరల్ (గుంటూరు) : తెనాలిలో ఆదివారం కురిసిన వానతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మధ్యాహ్నం 4 గంటల వరకు విపరీతమైన ఎండ ఉండి, తరువాత వాతావరణం చల్లబడింది. తెనాలిలో భారీ వడగండ్ల వాన కురిసింది. తెనాలి టౌన్ చర్చి, చినరావూరు, చెంచుపేట, ఐతానగర్, నందులపేట, విమానం మేడ, బలజీరావు పేట పరిసర ప్రాంతాల్లో వడగండ్లు కురిశాయి. చిన్నారులు వడగండ్లను చేతులతో పట్టుకుని సంబరపడ్డారు.
