హిందూపురం (అనంతపురం) : హిందూపురం మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ కుమార్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. చేతులెత్తే విధానంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఎన్డీఏ కూటమికి ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి 23 మంది బలం ఉండటంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లుపడ్డాయి. ఆరు నెలల క్రితం వైసీపీ ఛైర్‌పర్సన్ ఇంద్రజ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది.
చేతులెత్తే విధానం – హిందూపురం మున్సిపల్ పీఠం టీడీపీ కైవసం
