ప్రజాశక్తి-రేపల్లె: చేనేత ఉద్యమకారుడు, ప్రజాబంధు ప్రగడ కోటయ్య 29వ వర్ధంతి ఘనంగా ని ర్వహించారు. ముందుగా రేపల్లె చేనేత సహకార సం ఘం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రేపల్లె చేనేత సహ కార సంఘం మాజీ అధ్యక్షులు పట్టెం శ్రీనివాసరావు మాట్లాడుతూ చేనేతల అభ్యున్నతి కోసం తుదికంటా శ్రమించిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య ఆశయాలను భావితరాలకు అందించాలన్నారు. ఒకప్పుడు స్వర్ణయు గాన్ని చూసి, ఒకానొక దశలో కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు ఎదుర్కున్న చేనేత రంగాన్ని తన అలు పెరుగని ఉద్యమాల ద్వారా చేనేత రంగానికి జవస త్వాలూదిన మహానుభావుడు ప్రగడ కోటయ్య అని, వారి అడుగుజాడల్లో న డుస్తూ, ఆయన ఆశయా లను భావితరాలకు అందిం చాల్సిన అవసరం ఉంద న్నారు. ప్రగడ కోటయ్య చేనేత వాణి అనే వారప త్రిక ద్వారా చేనేతల సమ స్యలను రాష్ట్రమంతటా విని పించారని గుర్తుచేశారు. పోరాట స్ఫూర్తితో వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని చేనేతలు ఐక్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమలో రేపల్లె పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునగాల నాగేశ్వరావు, జొన్నా దుల నాగరాజు, యంగల సంజీవయ్య, పోలిశెట్టి సంబశివరావు, వంగరకిరణ్, పట్టెం లీలాకష్ణ, కున్నెర్ల సుబ్బారావు, సంఘ మేనేజరు గొర్రె సాంబశివరావు, పోలిశెట్టి శ్రీనివాసరావు, మాచర్ల పండు, చేనేత నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.