ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా) : వన్నెకుల క్షత్రియ రాష్ట్ర చైర్మన్ సీ.ఆర్ రాజన్ కు ఏఎంసి మాజీ చైర్మన్, టిడిపి క్లస్టర్ ఇన్చార్జి ఇలంగోవన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వన్నె కుల క్షత్రియ రాష్ట్ర చైర్మన్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సి ఆర్ రాజన్ కు పిచ్చాటూరుకు చెందిన ఏఎంసి మాజీ చైర్మన్, టిడిపి క్లస్టర్ ఇన్చార్జి ఇలంగోవన్ రెడ్డి హార్దిక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం సి ఆర్ రాజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని పిచ్చాటూరు మండలానికి చెందిన ఆరణీయారు ఆయకట్టు సంఘం చైర్మన్ రవి రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు పద్దు రాజు, జయచంద్ర నాయుడు, దిలీప్ రాజు లతో కలిసి ఇలంగోవన్ రెడ్డి, సి ఆర్ రాజన్ స్వగృహానికి చేరుకుని ఆయనకు గజమాల వేసి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సి ఆర్ రాజన్ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ఇలంగోవన్ రెడ్డి ఆకాంక్షించారు.