పజాశక్తి-దర్శి: స్థానిక వైసిపి కార్యాలయంలో 75వ రాజ్యాంగ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉన్నాయని అన్నారు. భారత రాజ్యాంగాన్ని అందరూ ఆమోదించి మంచి పౌరులుగా ఉండాలని కోరారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎంపిడిఓ కృష్ణమూర్తి, తహశీల్దార్ ఎం శ్రావణ్‌కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సభలో ఎంపీపీ గొల్లపాటి సుధారాణి ఆధ్వర్యంలో ఇఓఆర్‌డి ఏ సుధాకర్ ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో డాక్టర్ బి సంధ్యారాణి, డాక్టర్ వరప్రసాదు విద్యార్థులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆర్‌టిఓ కార్యాలయంలో ఆర్‌టిఓ రవికుమార్, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. సంతనూతలపాడు: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతి సంపద అని నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మంగళవారం మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, సంతనూతలపాడు నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున విచ్చేశారు. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా నియోజకవర్గం కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని జడ్పీటీసీలు దుంపా రమణమ్మ, వేమా శ్రీనివాసరావు, ఎంపీపీలు బి విజయ, యద్దనపూడి శ్రీనివాసరావు, వాకా అరుణ కోటిరెడ్డి, అంజమ్మ కృష్ణారెడ్డి, మండలాల పార్టీ అధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్లు, శ్రీమన్నారాయణ, మండవ అప్పారావు, చీమకుర్తి పట్టణ అధ్యక్షులు కిష్టపాటి శేఖర్‌రెడ్డి, నాయకులు దుంపా యలమందరెడ్డి, మంచా హరికృష్ణ, ఎస్ విజయభాస్కరరెడ్డి, కౌన్సిలర్ పాటిబండ్ల గంగయ్య, తేళ్ల పుల్లారావు, సర్పంచ్లు, ఎంపిటీసిలు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.