ఘనంగా డివైఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవం

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు (కర్నూలు) : నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్‌ ప్రశ్నించారు. డివైఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా … శుక్రవారం పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీ, ఎస్సీ కాలనీలో, డివైఎఫ్‌ఐ జెండాను జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్‌ ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి డివైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు మహేష్‌ అధ్యక్షతన నిర్వహించారు. డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్‌, పట్టణ కార్యదర్శి సురేష్‌ వారు మాట్లాడుతూ … డివైఎఫ్‌ఐ 1980 నవంబర్‌ 1వ తేదీన పంజాబ్‌ రాష్ట్రంలో లూథియానా లో డివైఎఫ్‌ఐ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు అందరికీ విద్య అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని, భగత్‌ సింగ్‌ స్పూర్తి తో పని చేస్తున్న యువజన సంఘం డివైఎఫ్‌ఐ అని చెప్పారు. కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భఅతి 3000 రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటిదాకా అమలు చేయలేదు ఎప్పుడు ఇస్తారు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోంది ఇప్పుడు దాకా అమలు చేయలేదని అడిగారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మిగనూరులో చేనేత పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని కోరుతు పైన తెలిపిన విషయాలన్నీ పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులను ఏకం చేసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు ఉదరు, భీమేష్‌, మోహిన్‌, గురు, కుమార్‌, రాజేష్‌, అభిషేక్‌, నరసింహ, నర్సప్ప, తదితరులు పాల్గొన్నారు.

➡️