ఘనంగా గాంధీ జయంతి

Oct 2,2024 16:45 #Happy Gandhi Jayanti

తడ (చిత్తూరు) : తడ మండలంలో గాంధీ జయంతి సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగినది. తదుపరి స్వచ్ఛత హి సేవ లో భాగంగా శ్రమదానంను మండల యం పి డీ ఓ విజరు కుమార్‌ తో పాటుగా మండల అధ్యక్షులు కొలివి రఘు రెడ్డి మరియు మండల ఉపాధ్యక్షులు, తోటి సిబ్బంది కలసి శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇటీవల విజయవాడలో భారీ వర్షాలకు వచ్చిన వరద కు అప్పుడు అక్కడ శానిటేషన్‌ కొరకు తడ మండలం నుంచి కొందరు సిబ్బందిని పంపడం జరిగింది. వారు వారి వారి విధులను సక్రమంగా నిర్వహించడం మరియు వారితో పాటుగా మండలంలోని సఫాయి కర్మచారులకు బుధవారం స్వచ్ఛత హి సేవలో భాగంగా వారిని ఘనంగా సన్మానం చేసారు.

➡️