ప్రజాశక్తి-సీతమ్మధార: డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల పూర్వ అధ్యక్షులు విబివి రెడ్డి శతజయంతిని శుక్రవారం కళాశాల ఆవరణలో యాజమాన్యం, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ జి మధు కుమార్ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. వ్యాపారవేత్తగానే కాకుండా సేవా దృక్పథంతో వ్యవహరించేవారని, ఎంతోమంది ప్రతిభావంతులైన పేదవిద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల ద్వారా ఆర్థిక సహాయం అందించారన్నారు. ఆయన చూపిన మార్గంలోనే యాజమాన్యం నేటికీ నడుస్తోందన్నారు. ఈ సందర్భంగా కాలేజీ ఆవరణలో మెగా రక్తదానశిబిరం నిర్వహించగా, విద్యార్థులు పెద్దఎత్తున స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.