జనసేన నేతలతో హరిప్రసాద్‌ భేటి

Jun 11,2024 19:07
జనసేన నేతలతో హరిప్రసాద్‌ భేటి

చిత్తూరు జిల్లా జనసేన నేతలతో మాట్లాడుతున్న హరిప్రసాద్‌
జనసేన నేతలతో హరిప్రసాద్‌ భేటి
ప్రజాశక్తి – లింగసముద్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌ ను లింగసముద్రం మండల జనసేన అధ్యక్షులు అంగులూరి నరసింహారావు మర్యా దపూర్వకంగా కలిశారు. మంగళవారం తిరుపతిలో ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధిం చింది. ఈ సందర్భంగా డాక్టర్‌ హరిప్రసాద్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో జన సైనికులు వీరోచితంగా పనిచేసి జనసేన పార్టీకి అఖండ విజయాన్ని అందించారన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం జనసైనికులు శక్తివంచన లేకుండా పనిచేశారన్నారు. జనసేన పార్టీ అభివద్ధికి అందరూ పని చేయాలని ఆ విధంగా అధినాయకుడు అడుగుజాడల్లో నడవాలని నరసింహారావుకు సూచించారు.

➡️