మాచర్లలో భారీగా షిఫ్ట్‌ అయన ఓటర్లు

Jun 10,2024 23:40

ప్రజాశక్తి – మాచర్ల : మాచర్ల నియోజకవర్గం టిడిపి, వైసిపి పార్టీల మధ్య పోటాపోటీగా ఉండే నియోజకవర్గం. ఏ పార్టీ గెలిచినా 10 వేలు లోపు మోజారిటీతో విజయం సాధిస్తుంటారు. 2004 వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఒక్కసారి కాంగ్రెస్‌ ప్రభంజనంలో 30 వేల మోజారిటీ రికార్డు నమోదైంది. ఆ తరువాత 2019 ఎన్నికలలో జగన్‌ హవాలో 22 వేల ఓట్ల తేడాతో వైసిపి విజయం సాధించింది. 2019 ఎన్నికలలో వైసిపికి టిడిపికి మధ్య ఓట్ల తేడా 10.33 శాతంతో 21,918గా ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2,12,140 ఓట్లు పోలవ్వగా టిడిపికి 88,488 (41.71 శాతం) వైసిపికి 1,10,406 (52.04 శాత) ఓట్లు సాధించారు. 2024లో 2,20,099 ఓట్లు పోలవ్వగ, టిడిపికి 1,22,413 (55.62 శాతం), వైసిపికి 89,095 (40.48 శాతం) ఓట్లు వచ్చాయి. 15.14 శాతంతో 33,318 ఓట్ల మోజారిటీని టిడిపి కైవసం చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో 44,277 మంది ఓటర్లు షిఫ్ట్‌ ఆవ్వటంతో ఈ మేరకు స్థానిక నాయకత్వంపైన వ్యతిరేకతగా స్థానికులు భావిస్తున్నారు.

➡️