రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

Jan 8,2025 21:14

మరో కానిస్టేబుల్‌కు గాయాలు

ప్రజాశక్తి- గంట్యాడ : మండలంలోని కొండతామరపల్లి జంక్షన్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎపిఎస్‌పి బెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఎన్‌వి రమణ మృతి చెందారు. మరో కానిస్టేబుల్‌ గురునాధ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. రమణ అనంతగిరిలో విధులు ముగించుకుని విజయనగరం వైపు వస్తుండగా విజయనగరం నుంచి అనంతగిరి విధులకు వెళుతున్న గురునాథ్‌రెడ్డి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢ కొట్టాయి. ఈ ప్రమాదంలో రమణ అక్కడికక్కడే మృతి చెందగా గురునాథ్‌ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న విజయనగరం సిఐ లక్ష్మణరావు గంట్యాడ ఎస్‌ఐ సాయికృష్ణ పోలీస్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను 108 వాహనంలో విజయనగరం ఆసుపత్రికి తరలించారు.

➡️