బధిరుల పాఠశాలలో ఆరోగ్య శిబిరం

ప్రజాశక్తి-కనిగిరి : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం కనిగిరి పురపాలక సంఘం పరిధిలోని కొత్తూరులో గల ఎస్‌కెఆర్‌ మానసిక, బధిరుల పాఠశాలలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ జడ్జి, కె భరత్‌చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కనిగిరి ప్రభుత్వ వైద్య విధాన పరిషత్‌ కమ్యూనిటీ వైద్యశాల కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ తిరుపతిరెడ్డి కంటి సమస్యలు గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించారు. ఎముకల వైద్య నిపుణులు డాక్టర్‌ అబ్దుల్‌ కలాం ఎముకలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు తీవ్రంగా ఉన్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలను డైరెక్ట్‌ చేశారు. అక్కడ మరలా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు అందజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్‌ న్యాయవాది షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, కనిగిరి బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు బాల నారాయణ, న్యాయవాది పాశం పిచ్చయ్య, పారా లీగల్‌ వాలంటీర్‌, గుడ్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మండ్రు రమేష్‌ బాబు, ఎస్‌కెఆర్‌ పీపుల్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ కార్యదర్శి అంజిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

➡️