ఆరోగ్య సూత్రాలు పాటించాలి : ఫెమి సంస్థ

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండల పరిధిలోని తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ”” సుచి శుభ్రత పాటిస్తే ఆనందం అవుతుంది మన సొంతం””.. యుక్త వయసు వచ్చిన బాలికలు, పీసీఓడీ సమస్య ఉన్నవారు, థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు, తెల్లమైలు సమస్య ఉన్నవారు… ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఫెమి సంస్థ నిర్వాహకులు అనంతము నిరాజ జయశ్రీ, హెల్త్‌ సూపర్వైజర్‌ శ్రీదేవి పేర్కొన్నారు. హ్యాపీ యూట్రస్‌ హెల్తీ పీరియడ్స్‌ అనే అంశం పై హెల్త్‌ స్టాఫ్‌ కి అవగాహన సమావేశం నిర్వహించి ఇందులో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వలన అన్ని రకముల అనారోగ్యాలకి దూరంగా ఉండవచ్చునని తెలిపారు. పరిశుభ్రమైన నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్‌ వాడకాన్ని ప్రజలలో అవగాహన కల్పించి, అనారోగ్యాలకు దూరంగా ఉంచాలని ఫెమీ సంస్థ నిర్వాహకులు తెలిపారు.

➡️