ప్రజాశక్తి-శింగరాయకొండ పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చునని టంగుటూరు ఐసిడిఎస్ ప్రాజక్టు సిడిపిఒ మల్లేశ్వరి తెలిపారు. శింగరాయకొండలోని బైరాగి మాన్యం-1 అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహారం మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఒ మాట్లాడుతూ గత 30 రోజులుగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలకు ఆహార అలవాట్లపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చునని తెలిపారు. అనంతరం చిరుధాన్యాల వంటల మొక్క ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బివిసి.రాజేశ్వరి, సూపర్‌వైజర్ ఎస్‌కె.రిజ్వానా, ఐటిసి ట్రైనర్ వెంకటలక్ష్మి, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. కొండపి : కొండపి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అన్ని గ్రామాలలో పోషహాకార మాసోత్సవాలు సోమ వారంతో ముగిసినట్లు సిడిపిఒ మాధవీలత తెలిపారు. స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో పోషకాహార మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ ఏర్పాటు చేసిన పోషహాకార స్టాల్స్‌ను తహశీల్దారు మురళి పరిశీలించారు. అనంతరం తహశీల్దారు మురళి మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు తప్పని సరిగా పోషకాహారాన్ని తీసు కోవాలన్నారు. డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ పౌషకాహారం, బాల్యవివాహాల నిర్మూలన, రక్తహీనత గురించి వివరించారు. రీ కార్యక్రమంలో ఎంఇం సురేఖ. అంగన్‌వాడీలు పాల్గొన్నారు. టంగుటూరు : పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని టంగుటూరు సర్పంచి మద్దిరాల మమత తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఒ మల్లీశ్వరి మాట్లాడుతూ గర్భిణులు , బాలింతలు తప్పని సరిగా పోషహాకారం తీసుకోవాలన్నారు. పోషకాహారం తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ మాతయ్య, సూపర్‌వైజర్ సైదాబి, అంగన్‌వాడీలు, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.