భారీగా బంగారు, వెండి పట్టివేత

ప్రజాశక్తి – బద్వేలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దు వద్దనున్న పిపి కుంట చెక్‌ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో 7.6 కిలోల బంగారు, 11.26 కిలోల వెండి ఆభ రణాలను పట్టుకున్నారు. వాటికి ఎలాంటి అను మతులు, రషీదు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని బద్వేల్‌ రూరల్‌ సిఐ విక్రమ్‌ సింహా పేర్కొన్నారు. పట్టుబడిన ఆభరణాల వాహనాన్ని ప్లయింగ్‌ స్క్వాడ్‌, రెవెన్యూ అది óకారుల సమక్షంలో సీజ్‌ చేసి ఆదాయపు పన్ను అధికారులకు అప్పగించామని చెప్పారు. ఆభర ణాల ఖరీదు సుమారు రూ. 5 కోట్లు ఉంటు ందని అధికారులు అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్‌ నడుస్తు న్నం దున అధిక మొత్తంలో డబ్బు, మద్యం, బంగారు ఆభర ణాలు రవాణా చేయకూడదని తెలిపారు. తనిఖీ ల్లో ఎస్‌ఐ రవికుమార్‌, పిపి యాదవ్‌, సిద్ధారెడ్డి, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️