పాలకొల్లు లో భారీ వర్షం

Oct 8,2024 15:35 #ap rains, #Palakollu

ప్రజాశక్తి – పాలకొల్లు : పాలకొల్లు లో మంగళవారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. దీంతో విజయదశమి పందిళ్ళు తడిచి ముద్ద అయ్యాయి. వర్షం కారణంగా వ్యాపారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయదశమి వేళ కొద్దిగా అయిన రెడీ మేడ్ బిజినెస్ ఉంటుందనుకొంటే వర్షం కారణంగా ప్రజలు బైటకు రాకపోవడంతో బిజినెస్ లేదని రెడీ మేడ్ వర్తకులు చెబుతున్నారు. గత 2 రోజులుగా మబ్బులు, ఎండ దోబూచులాడు కుంటూ చివరికి వర్షం దంచికొట్టింది.

➡️