ప్రజాశక్తి – రేగిడి : మండల సంకిలి, ఉంగరాడ మెట్ట, బూరాడ తదితర గ్రామాల్లో మంగళవారం గాలి, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు, ప్రజలు అల్లాడిపోయారు. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో వాతావరణం చల్లబడి గాలి ఉరుములతో కూడిన భారీ వర్షం పడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. అలాగే ఈ వర్షంతో మొక్కజొన్న, నువ్వు పంట ఇతర అపరాలు పంటల రైతులు కొంతమేర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
