ప్రజాశక్తి – వినుకొండ : వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినుకొండ పట్టణంలో 2 వేల మందికిపైగా ముస్లిములు సోమవారం భారీ ర్యాలీ చేశారు. ప్రధాన వీధుల్లో సాగిన ర్యాలీలో ఆద్యంతం నినాదాలు చేశారు. శివయ్య స్తూపం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. తమ మతపరమైన, సాంస్కృతిక పరమైన గుర్తింపును దెబ్బతీయొద్దని, రాజ్యాంగ విరుద్ధమైన ఈ సవరణ చట్టాలన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా సవరణ చట్టం ఉందని, దేశంలోని మైనారిటీల హక్కులకు దీర్ఘకాలిక ముప్పును కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలు భవిష్యత్తులో ఇతర వర్గాలకు విస్తరించే ప్రమాదం ఉందని చెప్పారు.
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాజ్యాంగాన్ని కాపాడాలని, వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎంహెచ్.పి.ఎస్ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణం గడియార స్తంభ కూడలిలో బిఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు ప్రదర్శించారు. ఎంహెచ్‌పిఎస్ రాష్ట్ర నాయకులు షేక్. మస్తాన్‌వలి మాట్లాడారు. రసూల్ రఫీ, మాబు, కరీముల్లా, బడే బాబు, జిలాని గౌస్, కరీముల్లా రజాక్, ఖలీల్, సిపిఎం నాయకులు సిలార్ మసూద్, శివకుమారి, సిపిఐ నాయకులు కె.రాంబాబు, పిడిఎం నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు.
