ప్రజాశక్తి-మదనపల్లె జిల్లాలో తీవ్రమైన కరువును ఎదు ర్కొన్న మండలాలకు కేంద్ర ప్రభుత్వ సాయం అవస రమని కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. జిల్లాలో కరువు మండలాల క్షేత్ర పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రియ మాలిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల బందం, జిల్లాలోని బి.కొత్తకోట, వాల్మీకిపురం, మదనపల్లె, తంబళ్లపల్లె, తదితర మండలాలను సందర్శిం చారు. కేంద్ర ప్రభుత్వ బందం వివిధ మండ లాలను సందర్శించిన సందర్భంగా కేంద్ర బందం, ఖరీఫ్ సీజన్లో పడిన వర్షపాతం, పశువులకు అందుబాటులో ఉన్న పశుగ్రాసం, పండించిన పంటల నష్టాలు తదితర విషయాలపై స్థానిక రైతులతో చర్చించారు. గతంలో లాగా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు పశుగ్రాసం అందించగలిగితే తమకు ఎంతో సహాయంగా ఉంటుందని కొంత మంది రైతులు కేంద్ర బందానికి తెలిపారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వివిధ రకాల పథకాలను ఉపయోగించుకొని పశుగ్రాసం సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచిం చారు. మండలాలను సందర్శించిన అనంతరం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కేంద్ర బందం కలెక్టర్ శ్రీధర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో నమోదైన కరువు తీవ్రత కరువు మండలాలపై కేంద్ర బందానికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌లో జిల్లాలోని 19 మండలాలను తీవ్రమైన కరువు మండలాలుగా ప్రకటించిందని తెలిపారు. ఖరీఫ్ 2024 సీజన్‌లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షపాతం చాలా తక్కువగా నమోదైందని, తద్వారా పలు మండలాలలో కరువు నమోదైందని, కేంద్ర బందానికి తెలిపారు. పశువులకు పశుగ్రాసం తక్కువగా అందుబాటులో ఉందని దీనివల్ల ఎంతోమంది రైతులు నష్టపోయారని బందానికి తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ నిబంధనల ప్రకారం కరువు పీడిత మండలాలకు సుమారు రూ.11 కోట్లు సాయం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. గ్రామ, మండలాల స్థాయిలో బందాలను ఏర్పాటు చేసి కరువు మండలాలలో పంట నష్టాలపై నివేదికలను తీసుకున్నామని, కరువు మండలాలలో దాదాపు 33 శాతం పంట నష్టం వచ్చిందని తెలిపారు. వేరుశనగ పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వ్యవసాయం మీద కాకుండా పశువులపై ఆధారపడి జీవనం సాగించే రైతులు కూడా ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. వర్షపాతం నమోదు తక్కువగా ఉండ డంతో వివిధ రిజర్వాయర్లలో నీరు తక్కువగా ఉండటం వల్ల కరువు మండలాలలో ప్రైవేటు ట్యాం కర్ల ద్వారా నీటి సరఫరాను అందించినట్లుగా పేర్కొ న్నారు. అనంతరం, జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా పశుసంవర్ధక శాఖ, జిల్లా ఉద్యానవన శాఖ, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా శాఖ తదితర శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన వివిధ విషయాలపై కేంద్ర బందానికి వివరిం చారు. సమావేశంలో జెసి ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్, పాల్గొన్నారు.