మంద బుద్ధి(ఆటిజం)పై అవగాహన సదస్సు

Apr 2,2024 16:46 #Kakinada

ప్రజాశక్తి – పెద్దాపురం : ప్రపంచ ఆటిజం దినోత్సవం సందర్భంగా స్థానిక మహాత్మా గాంధీ మున్సిపల్ పాఠశాల ఆవరణలోని భవిత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం ఎల్ శివ జ్యోతి అధ్యక్షతన తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా హెచ్ఎం శివజ్యోతి మాట్లాడుతూ ఆటిజం అనేది జన్యుపరంగా తల్లి గర్భస్థ సమయంలో ఉన్నప్పుడు సమస్యలు రావడం వల్ల,నెలలు నిండకుండా పిల్లలు పుట్టినప్పుడు ఆటిజం వచ్చే అవకాశం ఉందన్నారు.గర్భస్థ సమయంలో ఇన్ఫెక్షన్లు రావడం వల్ల,సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల పుట్టే పిల్లలకు ఆటిజం వంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉందన్నారు.శిశువు కదలికలకు సంబంధించి ఏదైనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలన్నారు. దీని నివారణకు,ఈ లక్షణాలను ముందుగా గుర్తించేందుకు గర్భస్థ సమయంలో డాక్టర్ల పర్యవేక్షణ అవసరమన్నారు.దీనికి సంబంధించి పలు సూచనలు ఆమె తల్లిదండ్రులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి శ్రీనివాసరెడ్డి,బి ఆనందరావు,బాలల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️