ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : శ్రీ సాయి మాతా క్రియేషన్స్ బేనర్ పై పి.సాయిరాం దర్శకత్వం లో స్వయ నిర్మాణంలో నిర్మించిన ”స్టూడెంట్” చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం బీచ్ రోడ్ లోని గ్రీన్ పార్క్ హోటల్లో హీరో సుమన్ చేతుల మీదుగా విడుదల చేయడమైనది. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ …. ఒక చక్కని గుర్తుండిపోయే పాత్ర చేశానన్నారు. ఆ పాత్ర తనకి చాలా సంతృప్తి నిచ్చిందని తెలియజేశారు. ప్రతీ తల్లి తండ్రి విద్యార్థులు ఈ చిత్రాన్ని తిలకించాలని ఇది చక్కని విలువగల చిత్రమని అన్నారు. దర్శకుడు సాయిరాం మాట్లాడుతూ … మంచి సందేశాత్మక చిత్రం గా దీన్ని నిర్మించామని అందరూ పాత్రకి తగినట్టు గా నటించారని అన్నారు. ఇందులో సీనియర్ నటులు సుమన్, సుధా, జబ్బర్దస్త్ అప్పారావు, సత్తి పండు, హీరో గా విద్యాసాగర్, ముఖ్య పాత్రలో రవితేజ నటించారు. దీనికి సంగీతం ప్రతాప్ అందించారు.
”స్టూడెంట్” పోస్టర్ ను ఆవిష్కరించిన హీరో సుమన్
