ప్రారంభంప్రజాశక్తి-కడప అర్బన్ ప్రముఖ సినీ హీరోయిన్ కీర్తి సురేష్ కడపలో తళుక్కుమన్నారు. సోమవారం కడపలో ది చెన్నై షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. హీరోయిన్ కీర్తి సురేష్ కడపకు వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ది చెన్నై షాపింగ్ మాల్ వద్దకు చేసుకున్నారు. సినిమా పాటకు ఆమె డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కీర్తి సురేష్ ది చెన్నై షాపింగ్ మాల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. కడపలో 28వ షాపును ఆమె ప్రారంభించారు. హీరోయిన్ రాక సందర్భంగా చిన్నచౌక్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐ ఓబులేసు, ఎస్‌ఐ రాజరాజేశ్వరెడ్డి, ఎఎస్‌ఐ సుబ్బరాజు, సిబ్బంది ఆమె వ్యక్తగత బాడీ గార్డులు రక్షణగా నిలించారు. కార్యక్రమంలో చెన్నై షాపింగ్ మాల్ చైర్మన్ మర్రి జనార్థన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మర్రి వెంకటరెడ్డి, యాజమాన్య ప్రతినిధులు జమున రెడ్డి పాల్గొన్నారు.
కడపలో హీరోయిన్ కీర్తిసురేష్ సందడి- ది చెన్నై షాపింగ్ మాల్
