గ్రామస్తులతో హైకోర్టు న్యాయమూర్తి మాటామంతి

Mar 22,2025 21:31

ప్రజాశక్తి- మెరకముడిదాం :  ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవికుమార్‌ శనివారం సాయంత్రం తన స్వగ్రామం బైరిపురం వచ్చారు. తన తండ్రి చీమలపాటి శ్రీరామమూర్తి, సోదరుడు శేఖర్‌తో కలసి బైరిపురం గ్రామంలో ఉన్న తన నివాసానికి చేరుకుని గ్రామస్తులను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు విజయనగరం వచ్చినా తన సొంత ఊరును మరచి పోకూడదనే తలంపుతో ఏ సమయమైనా అలా ఒక్క క్షణం వచ్చి అందరిని ఆప్యాయంగా పలకరించి వెళ్తుంటానని చెప్పారు. అందరు మంచిగా ఉండాలని, అందరికీ మంచి చేయాలి, తోటివారికి సహాయ పడాలి, జన్మనిచ్చిన తల్లి తండ్రులను మరచి పోకూడదనిి చెప్పారు. ఆయన వెంట జిల్లా జడ్జి కల్యాణ చక్రవర్తి, చీపురుపల్లి సిఐ శంకరరావు, బుధరాయవలస ఎస్‌ఐ లోకేష్‌కుమార్‌, గ్రామ పెద్దలు పప్పల గృహనేశ్వరరావు, కందుల మల్లికార్జునరావు, సింగారపు రామకృష్ణ, పప్పల క్రిష్ణమూర్తి, కందుల శ్రీనివాసరావు, కెంగువ ధనంజయ తదితరులు ఉన్నారు.

➡️