ప్రజాశక్తి – కడప ప్రతినిధిబిందుసేద్యం అధిక దిగ బడులకు చిరునామాగా నిలిచింది. ఫలి తంగా సూక్ష్మసేద్యానికి రోజురోజుకూ ఆద రణ పెరుగుతోంది. ఇందులోభాగంగా 20 24-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించాం. ఇందులో భాగంగా అర్హులైన రైతుల్లో 80 శాతం మందికిపైగా పరికరాలను సైతం అందిం చడమైంది. ఏడేళ్ల కిందటి నుంచి జిల్లాలోని 36 మండలాల్లో 65 వేల హెక్టార్లలో బిందుసేద్యం ద్వారా పంటలను సాగు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో జిల్లాలోని పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లోనూ బిందుసేద్యం పెద్దఎత్తున సాగవుతోందని పేర్కొంటున్న ఎపిఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.వెంకటేశ్వరెడ్డితో ప్రజాశక్తి ముఖాముఖి…బిందుసేద్యం పురోగతి ఎలా ఉంది? 2024-25 ఆర్థిక సంవత్సరంలో13 వేల ఎకరాల్లో బిందు సేద్యం చేయడమే లక్ష్యం. ఇందులోభాగంగా ఇప్పటికి 8,250 ఎక రాలకు బిందుసేద్యం చేయడానికి సంబంధించిన అనుమతుల కసరత్తును పూర్తి చేశాం. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి మరో ఐదు వేల నుంచి ఏడు వేల ఎకరాలకు బిందుసేద్యం సదుపాయం అందించే అవకాశం ఉంది.స్ప్రింకర్ల సాగు తీరుతెన్నుల్ని వివరించండి? జిల్లాలో స్ప్రింక్లర్ల సాగు లక్ష్యం 2,000 హెక్టార్లు. ఇందులో భాగంగా 1,720 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 2,187 హెక్టార్లలో సాగుకు అవకాశం ఉంది. ఇందులో 563 దరఖాస్తులకు 689 హెక్టార్లలో సాగుకు అవకాశం ఉంది. బిందు, స్ప్రింకర్ల సాగు మొత్తా న్ని పరిశీలిస్తే 15 వేల హెక్టార్ల సాగు లక్ష్యానికిగానూ ఇప్పటికి 8, 250 హెక్టార్లలో సాగుకు దరఖాస్తులు వచ్చాయి. 2025 మార్చి నెలాఖరు నాటికి 13 వేల హెక్టార్ల నుంచి 15 వేల హెక్టార్లలో సాగు చేయడానికి అవకాశం ఉంది.దరఖాస్తుల వివరాలు తెలపండి?6,039 దరఖాస్తులను స్వీకరించాం. ఈమేరకు 6,988 హెక్టార్లలో సాగు చేయడానికి అవకాశం ఉంది. ఇందులో 17,880 మంది రైతులు 22,215 హెక్టార్లలో ప్రాథమిక సర్వే చేశాం. ఇందులో 6,039 మంది 6,988 హెక్టార్లకుగానూ ఎస్టిమేషన్ వేయడమైంది. సబ్సిడీ వివరాలను తెలపండి? బిందుసేద్య పరికరాలకు సబ్సిడీ వరిస్తుంది. ఇందులో ఐదె కరాలు లోపు కలిగిన ఎస్‌సి, ఎస్‌టి రైతులకు 90 శాతం, 10 ఎకరాలు కలిగిన మిగిలిన అన్ని కేటగిరీల రైతులకు 70 శాతం చొప్పు న సబ్సిడీ వర్తిస్తోంది.డ్రిప్ ఇరిగేషన్ కేటాయింపు విధానాన్ని తెలపండి? ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ప్రాంత ఆర్‌బికె అధికారులు మొదటగా ప్రాథమిక సర్వే, బయోక్యూ చేసి అర్హమైన రైతులకు సిరఫాసు చేయడం తప్పనిసరి. వీటిని ఎపి ఎంఐపి పీడీ 10 శాతం, ఎపిడి 10 శాతం, హార్టీకల్చర్ అధికారు లు 20 శాతం, ఎంఐఎస్‌హెచ్‌జి 10 శాతం, ఆర్‌బికె ఇన్‌ఛార్జులు 10 శాతం చొప్పున క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్ధారించడం జరు గుతుంది. బిందుసేద్యం ఆదరణకు గల కారణాలేమిటి? కరువు పీడిత ప్రాంతాలు కావడం, నాణ్యమైన దిగుబడు లకు అవకాశం ఏర్పడడం, కలుపు ఖర్చులు కలిసి రావడం తెలిసిందే. దీనికితోడు నీటి ఆదా, ఎరువుల వినియోగ పరిమాణం, విద్యుత్ బిల్లుల్లో తగ్గుదల వంటి అదనపు సౌలభ్యాలు కలిసి రావడం కారణ మని తెలుస్తోంది.డ్రిప్ ఇరిగేషన్‌కు ఆదరణ గల ప్రాంతాలేవి? జిల్లా వ్యాప్తంగా బిందుసేద్యం సాగుకు ఆదరణ లభిస్తోంది. ఇందులో పులివెందుల నియోజకవర్గ పరిధిలోని పులివెందుల, సిం హాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, వేంపల్లి, చక్రాయపేట తోపాటు పెండ్లిమర్రి, ముద్దనూరు, కొండాపురం మండలాల్లో పెద్ద ఎత్తున బిందుసేద్యం ద్వారా పంటలు సాగు చేయడం కనిపిస్తోంది.
