పెదకూరపాడులో అత్యధిక పోలింగ్‌

May 16,2024 00:10

బలుసుపాడులో క్యూలో ఉన్న ఓటర్లు
ప్రజాశక్తి – పెదకూరపాడు :
పెదకూరపాడు నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌, హోమ్‌ ఓటింగ్‌ తో కలిపి మొత్తం పోలింగ్‌ శాతం 90.21 నమోదైంది. పల్నాడు జిల్లాలో అత్యధికంగా ఓట్లు పోలైంది పెదకూరపాడులోనే. 2019లో ఇక్కడ 88 శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గం మొత్తం రెండు లక్షల 32 వేల 453 ఓటర్లు ఉండగా వీరిలో రెండు లక్షల ఏడు వేల 307 మంది పోలింగ్‌ రోజుల ఇవిఎంల ద్వారా ఓటేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ 2187 మంది, హోం ఓటింగ్‌ 195 మంది ఓటేశారు. నియోజకవర్గంలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 26 ఉండగా 149 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. వీటిల్లో 90 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. 21 పోలింగ్‌ కేంద్రాల్లో 95 శాతం కంటే ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి. అమరావతి మండలంలోని నెమలికల్లు 97.98, మల్లాదిలో రెండు పోలింగ్‌ కేంద్రాలు 97.05 శాతం, 96.25 శాతం, లింగాపురం 95.97, అచ్చంపేట మండలంలోని కంచుబోడు తండా97.64 శాతం, చల్లగరిక 96.10 శాతం, ఓరవగల్లు 95.86 శాతం, అంబడిపూడి 95.59 శాతం, గింజుపల్లి 95.01 శాతం, కొత్తపల్లి 95.09 శాతం, క్రోసూరు మండలంలోని పారుపల్లి 97.45 శాతం, అందుకూరు 96.23 శాతం, నాగారం 96.12 శాతం, గరికపాడు 95.67 శాతం, నాగవరం 95.55 శాతం, వుయ్యందన 95.52 శాతం, బెల్లంకొండ మండలంలోని వన్నాయపాలెం 95.37 శాతం, పెదకూరపాడు మండలంలోని లింగంగుంట్ల 97.07 శాతం, తమ్మవరం 95.84 శాతం, పాటిబండ్ల 95.24 శాతం, కన్నెగండ్ల 95.04 శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. అమరావతి మండలంలోని నెమలికల్లు గ్రామంలోని 263 పోలింగ్‌ కేంద్రంలో 97.98 శాతంతో నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఆ గ్రామంలోని 262 కేంద్రంలో 92.91 శాతం 261 పోలింగ్‌ కేంద్రంలో 91.14 శాతం ఓటింగ్‌ నమోదైంది. అత్యల్పంగా అమరావతిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో 75 శాతం కంటే తక్కువ పోలయ్యాయి. అమరావతిలోని 227 పోలింగ్‌ కేంద్రంలో 73.86 శాతం మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. ఇది నియోజకవర్గంలోని అత్యల్ప ఓట్లు పోలైన కేంద్రం.

➡️