విశాఖ : విశాఖలోని ఏయూ గ్రౌండ్ లో ప్రధాన మంత్రి సభ ఏర్పాట్లను హోం మంత్రి వంగలపూడి అనిత మంగళవారం పరిశీలించారు. పోలీస్ ఉన్నతాధికారులకు హోం మంత్రి పలు సూచనలు చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ …. ప్రధానీ మోడీ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తుందన్నారు. ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వేలకోట్ల రూపాయలతో అభివఅద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ శంకస్థాపన చేయనున్నారని తెలిపారు. ప్రధాని మోడీ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. 2019 నుండి 2024 వరకు పాయకరావుపేటలో ఒక్క కంపెనీ కూడా రాలేదని, ఇప్పుడు బల్స్ డ్రగ్ పార్క్,స్టీల్ ఫ్లాంట్ రాబోతున్నాయని అన్నారు. పెద్దసంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. పర్యావరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.