నీట్‌ ర్యాంకర్లకు సన్మానం

Jun 8,2024 23:50 #Neet rankers, #sanmanam
Neet rankers sanmanam

ప్రజాశక్తి-సీతమ్మధార : ఇటీవల విడుదలైన నీట్‌ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ విద్యార్థులను అక్కయ్యపాలెం వద్దగల కాలేజీలో సత్కరించారు. 696 మార్కులతో 2519 ర్యాంకు సాధించిన సత్యశ్రీ సహా 32 మంది విద్యార్థులకు తెల్లకోటు, పుష్పగుచ్చం, మెమోంటో, పూలదండలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆకాష్‌ విద్యాసంస్థల డిప్యూటీ డైరెక్టర్‌ ఆర్‌విఎస్‌.మూర్తి మాట్లాడుతూ, దేశంలో మంచి ర్యాంకులు సాధించడంలో ఆకాష్‌ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఆల్‌ ఇండియా లెవెల్‌లో 20 ఉత్తమ ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటారని తెలిపారు. విశాఖలో 13 మంది విద్యార్థులు పదివేల లోపు ర్యాంకులు సాధించి సంస్థ ప్రతిష్టను నిలబెట్టారన్నారు. ఈ సందర్భంగా విజయోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఈశ్వరీప్రసాద్‌, నిశాంత్‌ మిశ్రా, బ్రాంచ్‌ హెడ్‌ రాజేష్‌ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

➡️