ప్రజాశక్తి-కనిగిరి : మహాత్మాజ్యోతిరావు పూలే 134వ వర్థంతి సందర్భంగా కనిగిరి వైసిపి ఇన్‌ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ కనిగిరి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ సమాన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. మహిళా స్వాతంత్య్రం కోసం సమాన హక్కుల కోసం పోరాడారని అన్నారు. ప్రతి ఒక్కరికీ సమన్యాయం జరిగేలా వైసీపీ ప్రభుత్వంలో జగనన్న సారథ్యంలో అందరికీ సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమం జరగకపోగా వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తూ ఆనందపడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు వారికి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, జడ్పిటిసి మడతల కస్తూరిరెడ్డి, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, మాజీ ఏఎంసి చైర్మన్ చింతగుంట్ల సాల్మన్ రాజు, ఎస్సీ సెల్ నాయకులు కటికల వెంకటరత్నం, మాజీ సింగిల్ విండో చైర్మన్ సురసాని మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, కనిగిరి వార్డు సభ్యులు, శ్రీరామ్ సతీష్, మురళి, పిసిపల్లి మండల పార్టీ అధ్యక్షులు బొర్రారెడ్డి, మారెళ్ల సర్పంచి వెంకటరావు, ఎంపీటీసీ భూమిరెడ్డి కొండారెడ్డి, హనుమంతులపాడు మండలం సీనియర్ నాయకులు ఆదినారాయణ రెడ్డి, సర్పంచి భవనం కృష్ణారెడ్డి, హాజీపురం కన్వీనర్ చిట్యాల నాగార్జునరెడ్డి, నారాయణ, గుడిపాటిపల్లి ఎంపీటీసీ పాపబత్తిని నాగేశ్వరరావు, వెలిగండ్ల మండలం సీనియర్ నాయకులు భాస్కర్‌రెడ్డి, ఎస్సీ నాయకులు తాతపూడి నాని, గంజి రవీంద్రరెడ్డి, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ స్వర్ణ ఏడుకొండలరెడ్డి, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతగుంట్ల కిషోర్, హెచ్‌ఎంపాడు నాయకులు గొబ్బిళ్ల శీను, మహిళా నాయకులు నాగమణి, షకీలా బేగం, సుస్మిత తదితరులు పాల్గొన్నారు. పూలేకు నివాళి దర్శి: దర్శి వైసిపి కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావుపూలే వర్థంతి సందర్భంగా మహాత్మ జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్‌రెడ్డి, మిలరబుజ్జి, మాజీ ఎంపిపి ఇత్తడి దేవదానం, జగన్మోహన్‌రావు, సన్నీ మధు తదితరులు పాల్గొన్నారు.