మాట్లాడుతున్న ఈదర వెంకట పూర్ణచంద్
ప్రజాశక్తి తెనాలి : రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గి ని ఈ నెల 14 నుంచి బాయ్ కాట్ చేయాలని ఏపీ హోటలియర్స్ అసోసియేషన్ నిర్ణయించిందని అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి ఈదర వెంకట పూర్ణ చంద్ మంగళవారం తెలిపారు. ప్రారంభంలో స్విగ్గి హోటల్ వ్యాపారస్తులతో జీరో కమిషన్ అని ప్రారంభించి, ఇప్పుడు 30శాతం కమిషన్ తీసుకుంటుందన్నారు. పైగా దానికి అదనంగా జిఎస్టి వేసి వసూలు చేయటం, అట్లానే వ్యాపారస్తులకు తెలియకుండా ఆఫర్లు పెట్టడం, ప్రమోట్ చేస్తామని యాడ్స్ అడగటం లాంటి వాటితో వ్యాపారులను నష్టపరుస్తున్నారని చెప్పారు. ఫలితంగా స్విగ్గిని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కావున హోటల్ వ్యాపారస్తులందరూ స్విగ్గిని ఆఫ్ చేసి, ప్రత్యామ్నాయంగా జొమోటోని వాడుకోవాలని సూచించారు.
