ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న పడమటి రాజగోపుర నిర్మాణం తదితర అభివృద్ధి పనుల నిమిత్తం ఆలమూరుకు చెందిన సబ్బిశెట్టి వంశీయులు సోమవారం భారీ విరాళాన్ని అందించారు. సబ్బిశెట్టి తుకారాం గారి జ్ఞాపకార్ధం వారి కుమారులు నాగేశ్వరరావు, వీర వెంకట సత్యనారాయణ మూర్తి, రామసుబ్రహ్మణ్యంలు కలసి రూ.1,00,116లను సోమవారం దేవస్థానం అధికారులకు అందజేశారు. అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నిమిత్తం భక్తులు విరివిగా విరాళాలు అందించి సహకరించాలని ఈ సందర్భంగా దేవస్థానం ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి కోరారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు వైట్ల గంగరాజు, గ్రామ పెద్దలు గన్ని చిన్నబ్బు, చనుమోలు గణేష్, దేశాబత్తుల సత్యనారాయణ, దండంగి వెంకటేశులు, దంతమాల సారబ్బు, దేవస్థానం కార్యనిర్వాహక సిబ్బంది పాల్గొన్నారు.
