ప్రజాశక్తి-అద్దంకి: పట్టణంలోని కామేపల్లి కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు భారీ స్పందన లభించింది. మొత్తం 36 కంపెనీలు పాల్గొన్నాయి. జాబ్ మేళాకు 2,390 మంది అభ్యర్థులు హాజరు కాగా, 525 మందికి గొట్టిపాటి హర్షవర్ధన్ చేతుల మీదుగా నియామక పత్రాలు అంద జేశారు. మరో 300 మందిని రెండో రౌండ్ ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి చూపడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళాతున్నామని అన్నారు. జాబ్ మేళాలో పాల్గొన్న కొంతమందికి ఉద్యోగ అవకాశాలు రాకపోయినా నిరుత్సాహపడకుండా తిరిగి ప్రయత్నించాలని సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళా నిర్వహి స్తామని హర్షవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత లు, అసిస్ట్ సంస్థ ప్రతినిధులు జాష్టి కష్ణ హరీష్, విష్ణుప్రియ, హెచ్‌ఆర్సీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.