ప్రజాశక్తి-పొదిలి: పొదిలి పట్టణంలోని విశ్వనాధపురం ఆర్.డబ్లు.ఎస్ కార్యాలయం ఎదురు పట్టప గలు భారీ చోరీ జరిగింది. కుమార్తె వివాహం కోసం దాచుకున్న 30 సవర్ల బంగారం, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన పట్టణంలో ఒక్కసారిగా సంచల నంగా మారింది. రోజువారి చేతి వత్తి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బీరం నాసర్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలను ఉన్నత చదు వు చదివించేందుకు ఎంతో కష్టపడిన ఆయన కుటుంబంలో భార్యా భర్తలు రోజువారి కూలీ పనులు చేసుకుం టున్నారు. పిల్లల ఉన్నత చదువుల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టు కున్న వారు ఇటీవల కుమార్తెలకు ఉద్యోగాలు రావడంతో వాటిని విడిపించుకుంటూ వారి వివాహాలకు ప్రయత్నా లు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకులో ఉన్న బంగారాన్ని విడిపించుకుని పెద్ద కుమార్తె వివాహం కోసం ఇంట్లో దాచి ఉంచారు. ఇటీవల పెళ్లి చూపుల కోసం గ్రామంలో బంగా రాన్ని వాడుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉండగా సోమవారం ఉదయం భార్యాభర్తలిద్దరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం 12:30 సమయంలో భర్త నాసిరెడ్డి ఇంటికి రాగా అప్పటికే తలుపులు తెరిచి ఉండడానికి గమనించి భార్య వచ్చిందని అనుకుంటూ లోపలికి వెళ్లారు. బీరువా తాళం పగలగొట్టి ఓపెన్ చేసి ఉండడం గమనించి దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. సమాచారం అందు కున్న పొదిలి సిఐ టి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ వి.వేమనలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బీరువాను రాడ్‌తో పగలగొట్టి అందులో ఉన్న 30 సవర్ల బంగారు ఆభరణాలు, సుమారు రెండు కేజీల విలువైన వెండి వస్తువులను దొంగిలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, దొంగ తనం జరిగిన తీరును పరిశీలించిన సిఐ టి వెంకటేశ్వర్లు ఒంగోలు నుంచి క్లూస్ టీమ్ ను, జాగిలాన్ని రప్పించారు. బీరువా తాళాలు పగలగొట్టినా అక్కడ ఎటువంటి వేలిము ద్రలు లభించకపోవడంతో పోలీసులు నిరాశ చెందారు. అక్కడ దొరికిన ఒక చేతి రుమాలు ఆధారంగా వాసన చూస్తూ జాగిలం ప్రభుత్వ జూనియర్ కళాశాల గేటు వద్దకు వెళ్లి ఆగిపోయింది. పట్టపగలే భారీ దొంగతనం జరగ డంతో హడలిపోయిన పట్టణ ప్రజలు సీసీ కెమెరాలు బిగిం చినా చొరల జాడ దొరుకుతుందో లేదో అని అనుమాన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఇటీవల పట్టణంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటి కళ్ళు కప్పి వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం దర్శి రోడ్డులోని రామ్ నగర్‌లో జరిగిన దొంగతనాన్ని పట్టణ ప్రజలు మరు వక ముందే నేడు విశ్వనాధపురంలో పట్టపగలు దొంగలు హల్ చెల్ చేయడంతో దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులకు సవాల్‌గా మారింది.
