మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ పశ్చిమ బెంగాల్‌ కలకత్తా నగరం ఆర్‌జి కర్‌ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన మానవ మగాలను కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కడప కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలియజేశామని చెప్పారు. వైద్యురాలపై దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కఠినంగా శిక్షించాల్సిన బెంగాల్‌ ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. గౌరవ సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి 22 లోపు వివరాలు ఇవ్వాలని పదిమంది డాక్టర్స్‌ను నియమించడం హర్షించదగ్గ విషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల అయినప్పటికీ మహిళలను చిన్నచూపు చూడడం దుర్మార్గమని చెప్పారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు హత్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు పి.చంద్రారెడ్డి పి. వెంకటసుబ్బయ్య, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎం.పాపిరెడ్డి, రిమ్స్‌ నాయకులు భాస్కర్‌, పవను, దస్తగిరి, ఐఎంఎల్‌ , రఘురామయ్య లీడర్స్‌, ఐద్వా నగర్‌ అధ్యక్షురాలు జమీల, లతిఫా, శంషాబాద్‌, కాంట్రాక్టు ఉద్యోగులు రవి, ఉదరు,మున్సిపల్‌ నాయకులు హాజరయ్యారు.జెవివి సమతా విభాగం సంఘీభావం కలకత్తా వైద్య కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని పై జరిగిన అమానుష దాడి, హత్యకు నిరసనగా బుధవారం రిమ్స్‌ వైద్య విద్యార్థుల నిరాహారదీక్షకు కడప జనవిజ్ఞావేదిక, సమతా సభ్యులు కామేశ్వరమ్మ, అరుణ, సునీత, రాష్ట్ర కమిటీ సభ్యులు సరస్వతి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా రోజూ చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అంద పై ఇలాంటి ఆకత్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇలాంటి సంఘటనలు చాల బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు వీటిని నివారించే దిశగా చట్టాలు అమలు చేయాలని కోరారు. దోషులకు కఠిన శిక్షలు పడాలని తెలిపారు. ఈ సంఘటన కి బాధ్యులైన ప్రతి ఒక్కరిని శిక్షించి మహిళలకి అండగా ఉండాలని కోరారు. ప్రొద్దుటూరు : వైద్యవిద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితలను కఠినంగా శిక్షించాలని కోరుతూ స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి రాజీవ్‌సర్కిల్‌ వరకు సిఐటియు నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి విజయకుమార్‌ మాట్లాడుతూ కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన సంఘటన మరువకముందే మహారాష్ట్రలో ఆరు సంవత్సరముల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ముంతాజ్‌బేగం,పట్టణ కార్యదర్శి వెంకటసుబ్బమ్మ, రాములమ్మ, మున్సిపల్‌ యూనియన్‌ కార్యదర్శి సాల్మన్‌,అధ్యక్షుడు చంటి, కోశాధికారి రాఘవ, రవి, సిఐటియు నాయకులు బాలసుబ్బయ్య, చెన్నారెడ్డి, బాబు, లకిëదేవి, డివైఎఫ్‌ఐ కార్యదర్శి విశ్వనాధ్‌, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి సునీల్‌ పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : వైద్యరాలు పై హత్యాచారం చేసి, హత్య చేసిన మానవ మగాలను కఠినంగా శిక్షించాలని సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శి దాసరి.విజరు, డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద నుంచి ఆర్‌డిఒ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయ ఎఒ ఏవో తిరుపతయ్యకువినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓ మహిళా వైద్యురాలపై దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షుడు జి ఏసుదాసు, సిపిఎం కమిటీ సభ్యుడు ఏ వినరు కుమార్‌, సిఐటియు మున్సిపల్‌ యూనియన్‌ వర్కర్స్‌ అధ్యక్ష కార్యదర్శులు బి. నాగన్న , ఎస్‌.శేఖర్‌ , శివన్న , లక్ష్మి , సరళ, జయ లక్ష్మి ,సుగుణమ్మ, పుల్లమ్మ, లక్ష్మి,మరియమ్మ, విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మద్దతు తెలిపారు.

➡️