వంద రోజుల పాలన అస్తవ్యస్తం : కాంగ్రెస్‌

Sep 30,2024 21:28
వంద రోజుల పాలన అస్తవ్యస్తం : కాంగ్రెస్‌

మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు
వంద రోజుల పాలన అస్తవ్యస్తం : కాంగ్రెస్‌
ప్రజాశక్తి-నెల్లూరు :బాబు షఉరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేర్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం 100 రోజుల మంచి పాలన అని మురిసిపోవడం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌ రెడ్డి ఆక్షేపించారు. స్థానిక ఇందిరా భవన్‌లో డిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో చేవూరు మాట్లాడుతూ గత వంద రోజులుగా కక్ష సాధింపు ధోరణులు తప్ప తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు సిలిండర్ల ఉచితం, యువగళం, రైతుల పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలు ఇస్తానన్న ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు.రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉడతా వెంకట్రావు యాదవ్‌ మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే అమలు చేస్తామని చెప్పి, కనీసం సరిగ్గా సింగిల్‌ కూడా తీయలేని చంద్రబాబు మాయమాటలతో ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. షేక్‌ ఫయాజ్‌, ఏటూరి శ్రీనివాసుల రెడ్డి పిసిసి మెంబర్‌ బాల సుధాకర్‌, మోహన్‌ రెడ్డి ఎల్‌ సురేష్‌ మీడియా ఇంచార్జ్‌ కే .సంజరు కుమార్‌ అడ్వకేట్‌ మల్లి కిషోర్‌ రెడ్డి షేక్‌ హుస్సేన్‌ బాషా ఉన్నారు.

➡️