కృష్ణా జిల్లా పరిషత్‌కు ఐసిఎఐ అత్యున్నత పుస్కారం

  • కేంద్ర మంత్రి నుండి అవార్డు అందుకున్న చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (కృష్ణా) : కృష్ణా జిల్లా పరిషత్‌కు జిల్లా పరిషత్‌ కార్యకలాపాల నిర్వహణలో అత్యుత్తమ అకౌంట్స్‌ నిర్వహించినందుకు 2023-24 సంవత్సరానికిగానూ అత్యున్నత పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మకమైన చార్టెడ్‌ అకౌంట్స్‌ సంస్థ ఐసిఎఐ వారు ఈ పురస్కారం ప్రకటించారు. ఫిబ్రవరి 1న ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్‌ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ విభాగాలకు పురస్కారాలు అందిచారు. దీనిలో భాగంగా కృష్ణా జిల్లా పరిషత్‌కు ప్రకటించిన పురస్కారాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, ఐసిఎఐ ప్రెసిడెంట్‌ రంజిత్‌ కుమార్‌ చేతుల మీదుగా కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అందుకున్నారు. ఈ పురస్కారం రావడానికి కృషి చేసిన అధికారులు, ఉద్యోగులకు చైర్‌పర్సన్‌ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

➡️