కదిరి ప్రభాకర్‌కు న్యాయం చేయకపోతేరాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం

ప్రజాశక్తి-కడప అర్బన్‌ సలసల కాగే నూనెను దళితుడి ఒంటిపై పోసి రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసిన అంటరానితనం కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలం, పెన్న పేరూరు గ్రామంలో చోటుచేసు కుందని, రాష్ట్ర వ్యాప్త నిరసనలు జరుగుతున్నా, చలనం లేని వారుగా అధికారులు ఉంటు న్నారని కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ. నల్లప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు యం. డి. ఆనందబాబు పేర్కొన్నారు. మంగళ వారం కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రతినిధి బందం కడప జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కదిరి ప్రభాకర్‌ను పరామర్శించి, ప్రభాకర్‌ భార్య జయమ్మ, కుమారుడు సునీల్‌, బంధువు పాలయ్యను కలసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో పాశవికమైన ఘటన జరిగి 5 రోజులైనా బాధితులకు ఎఫ్‌ఐఆర్‌ చేతికిచ్చి, నింది తున్ని అరెస్టు చేస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పడంలో విఫలమ య్యారన ా్నరు. సిఐను ఎఫ్‌ఐఆర్‌ కాపీ అడిగితే బాధితున్ని వచ్చి తీసుకుని పోమ్మనడం దుర్మార్గమన్నారు. ప్రభాకర్‌పై నూనె పోసిన వెంకట సుబ్బారెడ్డిని మాత్రమే అరెస్ట్‌ చేస్తే సరిపోదని, నూనె పోయడానికి ముందే దళితుడైన కదిరి ప్రభాకర్‌ను కులం పేరుతో దూషించి, కట్టేతో కొట్టి, స్పహ తప్పి పడిపోయేలాగా చేసి ఆ తర్వాత సలసల కాగే నూనెను పోస్తుండగా చూస్తూ ప్రోత్సహించిన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేయా లన్నారు. ఎందుకిలా చేస్తున్నారని అడిగిన ప్రభాకర్‌ భార్య జయమ్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరును కేసులో నమోదు చేయాలన్నారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికీ దళితులు వీధి అరు గుపై కూడా కూర్చోవడానికి వీల్లేదు అంటూ హత్యాయత్నం చేసే స్థితికి దిగజా రుతుంటే, వాటిని రూపు మాప కుండా పాలకులు, అధికారులు చోద్యం చూస్తున్నారా ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌ ఐఆర్‌లో వివక్షత, హత్యాయత్నం, అత్యా చారం కేసులు నమోదు చేసి, బాధితుడైన కదిరి ప్రభాకర్‌ కుటుంబానికి రక్షణ కల్పించడంతోపాటు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో ఉన్న వీధి అరుగుపై ప్రభుత్వమే బాధ్యత తీసుకుని దళితులను కూర్చో బెట్టాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరిని కూడా కట్టి వివక్షత నిర్మూలించేలా ప్రతిఘటన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. కెవిపిఎస్‌ ప్రతినిధి బందంలో కెవిపిఎస్‌ కడప జిల్లా నాయకులు రాజేంద్ర, నంద్యాల జిల్లా నాయకులు కె.రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

➡️