ఫీజు కట్టకపోతే.. క్లాసులో నిలబెడతారా..?

ప్రజాశక్తి-చీరాల: ఫీజులు కట్టలేదని హాల్‌ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను క్లాస్‌ రూమ్‌లో నిలబెడుతున్న సంఘటనలపై ఏపీ చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిషన్‌ బత్తుల పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు వంటి చర్యలకు పాల్పడిన యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఆమె హెచ్చ రించారు. మంగళవారం పట్టణంలోని భాష్యం హైస్కూల్‌, శ్రీ చైతన్య హై స్కూల్‌ల్లో చీరాల ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వర రావుతో కలిసి తనిఖీ చేశారు. స్కూల్‌ ఆవరణంలో కంప్లైంట్‌ బాక్స్‌ ఏర్పాటు చేయాలేదని, బాత్రూమ్స్‌కి డోర్స్‌ లేవ ని, ఫీజులు కట్టని విద్యార్థులను క్లాసులో నిల బెడుతున్నట్లు పలు విషయాలు గురించి విద్యార్థుల ద్వారా స్వయంగా తెలుసుకున్నారు. ఫీజు విషయం తల్లిదండ్రులతో మాత్రమే మాట్లాడాలన్నారు. ప్రతి క్లాస్‌ రూమ్‌ వద్ద చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ 1098 నెంబర్ను బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు కొట్టినట్లు తెలిస్తే ఆ స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఆమె ఏకాంతంగా వారితో మాట్లాడి పలు సమస్యలను తెలుసుకున్నారు.

➡️