ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ (నంద్యాల) : మున్సిపాలిటీ సమస్యలు పరిష్కారం చేయకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం నాగేశ్వరావు హెచ్చరించారు. బుధవారం పట్టణ మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల నాయకుడు టి గోపాలకఅష్ణ అధ్యక్షతన జరిగింది .ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ నందికొట్కూరు మున్సిపాలిటీలో గత 10 రోజుల నుండి 29 వార్డులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగిందని సర్వేలో వచ్చిన విషయాలు ప్రధానంగా మారుతి నగర్ ,విలేకరి కాలనీ ,జగనన్న కాలనీ, కుమ్మరిపేట, బైరెడ్డి నగర్ ,వాల్మీకి నగర్ వడ్డెపేట, శేష సేనా రెడ్డి నగర్ ఉమ్మడి నగర్ ,సూది రెడ్డి రామిరెడ్డి నగర్, సి ఎస్ ఐ పాలెం ,తదితర కాలనీలో రోడ్లు ,డ్రైనేజీ కాలువ లేకపోవడం వర్షాకాలంలో వర్షం నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కుమ్మరి పేట కాలనీలో మరుగుదొడ్డి తొలగించాలని ,రెండు వీధి స్తంభాలు వేసి వీధిలైట్ చేయాలని, డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయాలి అని అన్నారు. జగనన్న కాలనీ లో రోడ్లు వేయాలి ,మంచినీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ఇంటింటికి కులాయి కనెక్షన్ ఇవ్వాలి,కాలనీలో చౌక డిపో ఏర్పాటు చేయాలి ,ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలి, మున్సిపాలిటీలో అర్హులైన పేదలకు వితంతు ,వికలాంగులు, వఅద్ధాప్య, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి కి, మునిసిపల్ మేనేజర్ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారం కోసం కఅషి చేస్తామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ ఉస్మాన్ భాష, బోయ మధు బాబు నాయుడు, ఎస్ సాజిదాబి, ఆర్ జయ,బాలస్వామి, గోకారి, వెంకటేశ్వర్లు గౌడ్, రామకృష్ణ గౌడ్, అబ్దుల్ రషీద్ ఖాన్, మంజుల, రసీదా, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
