ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : రోడ్లపై వాహనాలు నిలిపి ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించచేది లేదని యర్రగొండపాలెం సిఐ సిహెచ్‌ ప్రభాకరరావు హెచ్చరించారు. సోమవారం యర్రగొండపాలెం సర్కిల్‌ పరిధిలోని నాలుగు మండలాల ఎస్‌ఐల తో కలిసి యర్రగొండపాలెం పట్టణంలో ట్రాఫిక్‌ పై ప్రజలకు అవగాహన కలిగిస్తూ రోడ్లపై వాహ నాలు నిలిపే వారిపై చర్యలు చేపట్టారు. ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న వ్యాపారుల అక్రమణల ను తొలగించారు. ఎవరైనా రోడ్లపై వాహనాలు నిలిపినా, నెంబర్‌ ప్లేట్లు, లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపినా చట్టపరమైన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. నెంబర్‌ ప్లేట్లు, లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. జరిమానా విధించా రు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం, పుల్లలచెరువు, పెద్దారవీడు, పెద్దదోర్నాల మండ లాల ఎస్‌ఐలు పి చౌడయ్య, సంపత్‌ కుమార్‌, అనిల్‌, మహేష్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️