అక్రమ కట్టడాలను తొలగించాలి

ప్రజాశక్తి – రాయచోటి పట్టణంలోని అక్రమ కట్టడాలను తొలగిస్తామని రవాణా, యువజన క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి మున్సిపల్‌ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాషా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయని, ఇవన్నీ వెంటనే తొలగించాలని తెలిపారు. ఇకనుంచి పట్టణంల ోఅక్రమ కట్ట డాలు నిర్మిస్తే సహించేది లేదన్నారు. పట్టణంలో చాలామంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యాపా రస్తులకు ఎట్టి పరిస్థితులలో అన్యాయం చేయ మని చెప్పారు. పట్టణంలో పలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టి సుందరంగా తీర్చి దిద్దే ందుకు ఆక్షన్‌ ప్లాన్‌ తయారు చేస్తామని చెప్పారు. గతంలో భూ ఆక్రమణలు అధికంగా జరిగాయని, ముఖ్యంగా మదనపల్లె నియో జకవర్గంలో భూ ఆక్రమణలపై ప్రత్యేక చర్యలు తీసుకొని భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అభివద్ధి, సంక్షేమం రెండు కళ్ళు లాంటివని రాబోయే రోజులలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని తెలిపారు. పులివెందులలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి క్రీడాభివద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, మున్సిపల సిబ్బంది పాల్గొన్నారు.త్వరలో అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు.. త్వరలో అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ఆవులవాండ్లపల్లె, కావలి వాండ్లపల్లెలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ల సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాయచోటి నియోజకవర్గంలో ఎంతోమంది అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారని చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వంలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి, త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వాసు బాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు.. రాయచోటి నియోజకవర్గంలోని రాయచోటి, సంబేపల్లి, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, చిన్నమండెం మండలాలలో విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఎపి ఎస్‌ప ిడిసిఎల్‌ సిఎండి సంతోష్‌రావుకు సూచించారు. పట్టణంలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సిఎండి సంతోష్‌రావు తమ కుమారుని వివాహానికి హాజరు కావాలని మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి విశేష కషి చేస్తో ందని రాయ చోటి నియోజకవర్గంలో రైతులకు, గహ అవసరాలకు సంబంధించి విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎఇ, డిఇలకు సూచించారు. నూతన ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి.. పిఎంఎవై 2.0 పథకం ద్వారా కొత్త ఇల్లు మంజూరు కోసం వెంటనే దరఖాస్తులు సమర్పించాలని మంత్రి పేర్కొన్నారు. పట్టణంలోని మంత్రి క్యాంప్‌ కార్యాల యంలో పిఎంఎవై 2.0 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 పథకం ద్వారా కొత్తగా ఇల్లు మంజూరు కోసం లబ్ధిదారులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌ కార్డు, బ్యాంకు పుస్తకం, రేషన్‌ కార్డు, కుల, ఆదాయ సర్టిఫికెట్లు జిరాక్స్‌ కాపీలను సంబంధిత హౌసింగ్‌ కార్యాలయాలలో సమర్పించాలన్నారు. సచివాలయ ఉద్యోగికి అస్వస్థత శనివారం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ఆవుల వాండ్లపల్లెలో పెన్షన్లు పంపిణీ చేస్తూ సొమ్మసిల్లి పడిపోయిన సచివాలయ ఉద్యోగినికి మంత్రి వాటర్‌ బాటిల్‌ ఇచ్చి రెస్ట్‌ తీసుకోవాలని ఆమెను ఓదార్చారు. దీంతో ఉద్యోగులపై మంత్రి చూపుతున్న అభిమానం, మమకారంపై పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

➡️