అక్రమంగా అటవీ సందప తరలింపు

Jun 11,2024 19:54
అక్రమంగా అటవీ సందప తరలింపు

అక్రమ పద్ధతలో ట్రాక్టర్‌లో కలప తరలిస్తున్న దృశ్యం
అక్రమంగా అటవీ సందప తరలింపు
ప్రజాశక్తి-గుడ్లూరు మండలంలో విస్తారంగా ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూముల్లో ఉన్న అటవీ సందపను కొందరు అధికారులు రాత్రికి రాత్రి అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆక్రమాలని అడ్డుకున్న కిందిస్థాయి అధికారిని బెదిరించి సంపదని స్వాహా చేస్తున్నారు. ఈ అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించకపోవడంతో లక్షలాది రూపాయల విలువైన కలపని కారు చౌకగా అమ్ముకొని తిలాపాపం తలా ఒకరు అన్న చందంగా అటవీ సంపదని ఆరగిస్తున్నారు. మండలంలో మోచర్ల ,తెట్టు ,శాంతి నగరం, అడవి లక్ష్మీపురం ,అడవి రాజుపాలెం ,అమ్మవారిపాలెం, ఆర్‌ సి అగ్రహారం, మొగులూరు, పొట్లూరు ,పాజర్ల గ్రామాల పరిధిలో వేలాది హెక్టార్ల రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములు ఉన్నాయి. జామాయిల్‌ కర్ర సాగవుతోంది. వేపుగా ఎదిగిన జామాయిల్‌ కర్రని రిజర్వ్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారుల స్థాయిలో ఉన్న ఓ అధికారి చక్రం తిప్పి గత మూడు నెలలుగా కలపని రాత్రికి రాత్రే అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. కొందరు దళారులు రాత్రి సమయంలో ట్రాక్టర్లను తీసుకుని వచ్చి కూలీలు చేత కర్ర నరికించి టన్నుల కొద్ది కలపని తరలించుకొని పోయి కందుకూరు, కావలి పట్టణాల్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు రూ. 50 లక్ష ు విలువ చేసే కర్ర ని అమ్ముకొని జోబులు నింపుకుంటున్నట్లు రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములు చుట్టూ ఉండే గ్రామస్తులు చెబుతున్నారు. టన్నుల కొద్ది జామాయిల్‌ కర్ర తెట్టు ,మోచర్ల బీట్‌ ఆఫీసర్‌ ధనలక్ష్మి తన సిబ్బందితో చాకచక్యంగా అక్రమంగా తరలిపోతున్న జామాయిల్‌ కర్ర లోడ్‌ మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. రిజర్వు ఫారెస్ట్‌ భూమిలో జామాయిల్‌ కర్ర అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ యజమానులపై కేసు నమోదు చేసి గుడ్లూరు బీటు అధికారి చిరంజీవికి అప్పగించారు. ఆయన పై అధికారి కావలిలో నివాసముంటున్న డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ మోహన్‌ రావు కి ఫిర్యాదు చేశారు. జామాయిల్‌ కర్ర అక్రమ రవాణా పై విచారణ జరపాలని రేంజ్‌ ఆఫీసర్‌ అధికారులని ఆదేశించారు. అక్రమ రవాణా వ్యాపారస్తుల దగ్గర ముడుపులు మరిగిన అధికారులు విచారణ పేరుతో స్మగ్లర్లను పట్టుకున్న డేటు అధికారిని కేసు ఉపసం హరించుకోవాలని ఒత్తిడి చేశారు. రైతులకు చెందిన కర్రగా గుర్తించాలని బీటు అధికారిని వేధిస్తూ వచ్చారు. మాట వినకపోవడంతో ఆమెను రేంజ్‌ ఆఫీసుకు పిలిపించి బెదిరించారు. గతంలో మాట వినని మునమ్మా అనే బీట్‌ ఆఫీసర్‌ ని సస్పెండ్‌ చేయించి ఉన్నానని రేంజ్‌ అధికారి హెచ్చరించారు. చెప్పిన మాట వినకపోతే మీరు కూడా సస్పెండ్‌ అవుతారని గుర్తు చేశారు. దీంతో తెట్టు, మోచర్ల బీట్‌ ఆఫీసర్‌ ధనలక్ష్మి గుడ్లూరు మండలంలో ఫారెస్ట్‌ భూముల్లో జరుగుతున్న అక్రమాలు అవినీతి గురించి అధికారుల పనితీరు గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడంతో పరిస్థితి సద్దుమడిగింది. తాత్కాలికంగా అక్రమ రవాణా ఆగినా అడవి కలప అక్రమ రవాణా చేయటం వల్ల సుమారు 50 లక్షలు అవినీతి జరిగినట్టు అడవి శాఖ అధికారులలో చర్చ జరుగుతుంది. ఈ అవి నీతి పై సమగ్ర విచారణ జరపాల్సి ఉంది.

➡️