అక్రమంగా ఇసుక తరలింపు

May 16,2024 20:33

 ప్రజాశక్తి – సీతానగరం : మండలంలోని ఎటువంటి అనుమతుల్లేకుండా అక్రమంగా నాటుబండ్లతో ఇసుకను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని లక్ష్మీపురం మాజీ ఎంపిటిసి దాసర నాగరత్నం భూగర్భశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చల్లంనాయుడువలసలో సువర్ణముఖీ నది ఇసుకను ఎటువంటి అనుమతు ల్లేకుండా నాటు బళ్లపై తరలిస్తున్నారన్నారు. అలాగే ట్రాక్టర్లపైనా కూడా అక్రమ ంగా ఇసుకను తరలించి వేలాది రూపాయలకు బ్రోకర్లు అమ్ముకుంటున్నారని ఆమె అన్నారు. ఇసుక తవ్వకాలతో ఎక్కడికక్కడ గుంతులు ఏర్పాటుతో అందులో ప్రజలు పడిపోయి మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం ముగ్గురు పిల్లలు గొంతులో పడిపోయి చనిపోయారని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లకు, భవనాలకు, దేవాలయాలకు, ఇళ్ల నిర్మాణాలకు సచివాలయం ద్వారా అనుమతులు పొందిన వారికి ఉచితంగా ఇసుక సప్లై చేసి అక్రమంగా తరలిస్తున్న వారిపై జిల్లా అధికారి యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

➡️