ఏకీకృత పెన్షన్‌ విధానం అమలు తగదు : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-రాయచోటి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, ఉపాధ్యాయుల పనిసర్దుబాటు ప్రక్రియను పాఠశాల విద్యా శాఖ అధికారులపై స్థాయి నుంచి కింది స్థాయి వరకు గందరగోళానికి గురిచే శారని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ జాబిర్‌ పేర్కొన్నారు. అసంబద్ధ ఉపాధ్యాయుల పనిసర్దుబాటు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏకీకత పింఛను విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియను సవరించాలన్నారు. ఉన్నత పాఠశాలలో సబ్జెట్‌ టీచర్స్‌ నింపాలనే కారణంతో ఎస్‌జిటిలను ఇష్టారాజ్యాంగా, బలవంతంగా పని సర్దుబాటు చేశారన్నారు. గత ప్రభుత్వం జిఒ 117 ద్వారా ప్రాథమిక పాఠశాలలని విచ్ఛిన్నం చేస్తే ఇప్పుడు పనిసర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలలను బలహీన పరుస్తున్నారని పేర్కొన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న పాత పెన్షన్‌ స్కీమ్‌ ఉద్యోగుల హక్కు అని బిక్ష కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఖాతరు చేయకుండా సిపిఎస్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. గత వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన జిపిఎస్‌ విధానాన్ని రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల తిరస్కరించారు. పాత పెన్షన్‌ ఎక్కడా పోలికలేని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు లాభంలేని కార్పొరేట్ల షేర్‌ మార్కెట్‌ను మాత్రమే లాభాన్ని లేకూర్చే యుపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్‌ లేని పాత పెన్షన్ని పునరుద్దరించాలని డిమాండ్స్‌ వస్తున్న తరుణంలో ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తూ యుపిఎస్‌ లాంటి అంకెలగారడీ చేసే పెన్షన్‌ స్కీమ్‌ వద్దని, పాత పెన్షన్‌ విధానం పునరు ద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి బి.చంద్రశేఖర్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సురేంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి దావుద్దీన్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు ప్రసాద్‌, చిన్నమండెం మండల సహధ్యక్షుడు కిఫాయత్‌, సీనియర్‌ నాయకులురెడ్డి, ముని, సుధాకర్‌, కె.విపల్లె మండల అధ్యక్షుడు రమణ, నాయకులు రాజబాబు, మోహన్‌ నాయక్‌, నాయకులు పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2004లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్‌ విధానానికి స్వస్తి చెప్పి సిపిఎస్‌ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధ్యాయలకు తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్‌ నాయుడు, అసోసియేట్‌ అధ్యక్షులు హేమలత, కార్యదర్శిలు పురం వెంకటరమణ, ఆదినారాయణ, సీనియర్‌ నాయకులు రవిప్రకాష్‌, గాలి రవీంద్ర, సుధాకర్‌, శ్రీనివాసులు పయని హరికృష్ణ శ్రీలత, నాగరత్న పాల్గొన్నారు.

➡️