ప్రజాశక్తి….విజయనగరం టౌన్ : ద వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సృజనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా శనివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వింగ్ కమాండర్ కిరణ్ వి వైస్ ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, గౌరవ అతిదిగ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షలు భీశెట్టి బాబ్జీ పాల్గన్నారు. ఈ సఅజనోత్సవ్ ముఖ్య ఉద్దేశ్యము పిల్లల్లో గల సృజనాత్మక శక్తి, అవగాహన నైపుణ్యం, అన్వయించుకునే స్వబావం మరియు సమస్య పరిష్కారం నైపుణ్యం మెరుగు పరచడానికి ఎంతో దోహద పడతాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజి, వ్యవసాయం – ఆహారము, మన చుట్టూ ఉన్న పరిసరాలు – శుభ్రత, వాతావరణ మార్పులు నమూనాలను ప్రదర్శించడము జరింగింది. అద్భుతమైన నమూనాలను ప్రదర్శించిన విద్యార్థులను అతిదులు, పాఠశాల చైర్మెన్ సీతయ్య , పాఠశాల డైరెక్టరు వీరాస్వామి , ప్రిన్సిపల్ బి. లక్ష్మణమూర్తి వైస్ ప్రిన్సిపాల్ స్వప్న మరియు సైన్స్ ఉపాధ్యాయులు అభినందించారు.
